జోడు డప్పుల్ మోగే జోరు సప్పుళ్
ఎంట యాట పిల్లల్, నాటు కోడిపుంజుల్
నీ తానకు బైలెల్లినమే మైసమ్మ
తల్లి పిల్లజెల్ల కదిలినమే ఎల్లమ్మ
హెయ్, పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి
కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్
పాయసాలు తెచ్చినమే పోశమ్మ
నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ
నెత్తి సుట్టబట్ట సూసి మురిసేనంట
సుట్టూర శివాలూగే సంబరాలు కంట
కుంకుమద్దె నంట గోలుకొండ కోట
గజ్జెగట్టి దరువులేసి ఆడే బల్కంపేట
తడిబట్టల తానాల్, నియమాల బోనాల్
జగదంబ జేజమ్మకు నిండు ఒక్క పొద్దుల్
సూడుగొడ్డు గోదల్ పల్లే పాడి పంటల్
ఏటేటా ముట్టజెప్పుకుంటామే ముడుపుల్
అషాఢ మాసాల్, అంతురాల బోనాల్
ఆరగించగా రావే బెల్లం నైవేద్యాల్
తాటి కొమ్మ ర్యాకల్, మేటి కల్లు శాకల్
మెచ్చినట్టు తెచ్చినాము తీరు ఫలహారాల్
ఉజ్జయినీ మహంకాళి ఓరుగల్లు భద్రకాళి
రావె రావె… రావె తల్లీ
నిమ్మకాయ దండల్, యాపాకు మండల్
మాలగట్టి తెచ్చినాము తొలగించు గండాల్
వెండి గండ దీపాల్, కరిగించే పాపాల్
కాళికా కరుణగల్ల నీ సల్లని సూపుల్
ఈరగోల దెబ్బల్, పెట్టె పెడ బొబ్బల్
మహిమల్ల మహంకాళికి మత్త గొలుపుల్
గుడిసుట్టు మేకల్, పెట్టే గావు కేకల్
కూతవెట్టి పోతరాజు ఆడే వీరంగాల్
ఇంద్రాకీలాద్రి కనక దుర్గ
మమ్మేలు కొనగ రావె రావె
రావే తల్లీ (తల్లీ తల్లీ తల్లీ తల్లీ ..)
కూడినము సుట్టాల్, మరిశినాము కష్టాల్
జగమేలె తల్లికి పెట్టంగ పట్టు బట్టల్
కట్టినాము తొట్టెల్, జడితిచ్చే పొట్టెల్
గావురాల తల్లికి తొడగంగ పైడి మెట్టెల్
లాలూ దర్వాజల్, అలీజా నయాపూల్
షాలిబండ గౌలీపుర దేవి దర్బారుల్
పోటెత్తె భక్తుల్, ఎల్ల అదివారాల్
రంగమునాడినిపించు నీ మనసుల మాటల్
మీరాలంమండి దండి కాసరట్ట మహాంకాళీ
రారా రారా… రారా తల్లీ (తల్లీ తల్లీ తల్లీ తల్లీ)
0 Comments